- రామం భజే శ్యామలాం వాట్సాప్ సమూహం
- రామం భజే శ్యామలాం వాట్సాప్ సమూహం
వారానికో హృద్య పద్యంఅంశంతో నేను ప్రారంభించిన పద్యరచనలు అక్షరక్రమంలో
🙏1 అవని 🙏
1, అవని యె నన్నిలోకములయందు విశిష్ఠమునెంచి చూడగా
అవనియె సర్వ జీవ జనులందరి కాశ్రయమిచ్చు పే ర్మితో
అవని యెగొప్ప సంపద మహాద్భుతమౌ నశేష పెన్నిధీ
అవనికి కీడుసేయకుము నమ్మగ గొల్వుము నన్ని వేళలన్
2ఆమని
2. వచ్చె ను యామనీ వసుధ వర్ణపు శోభ ల వన్నెపెంచగా
సొచ్చెనుచైత్రమాసమునసొంపుగమావి చివు ళ్లువేయగా
తెచ్చెనుపుష్పగంధములతెమ్మెరవీయగగూచుకోయిలల్
ఇచ్చెనుకొత్తకాంతులనునిమ్మహినిండగనందచందముల్
3 ఇంధ్రధనుస్సు.
నీలి మేఘాలలో..,..అను మాదిరి
@@@@@@@@@@@@@
నీలి గగనమ్ము లో నింగి శిఖ రమ్ముపై
అగుపించి మురిపించావా, అందాల ఓ హరివిల్లు
!!నీలి!!
తళ తళ మెరుపులతో, ఫెళ్ల ఫెళ ఉరుములతో
జల జల జల్లులు రాల, మబ్బు వీడి భానుడురాగ
భాను కిరణాలు సోక .ప్రతి ఫలించావా……….!!నీలి!!
ప్రకృతి లో రంగుల న్నీ కలగలిపి సింగిడిలా
కనిపించే రంగులే డే కనపడని రంగులేన్నో……!!నీలి!!
క్షణమై న నీ రూపం, చెబుతుంది ఓ పాఠం
క్షణమైనా. జీవితం ,కావాలని సార్థకం………!!నీలి!!
వసుధ చుట్టు రంగుల వలయం
పరుచుకున్న ఓ నిమిషం
అనుక్షణం రంగుల మయము
కావాలని మన జీవితము ………… !!.నీలి!
4 ఈషణ త్రయము
----------------------
దారసుతుల ప్రేమ దండి గా లేకుండ
ఈ షణ త్రయమ్ము యిలలోన విడిచిన
నిశ్చయ మ్ము దొరుకు నీ శ్వరునిపదము
తే.గీ దాన ధర్మ మ్ము జేయక ధనము దాచి
తల్లి దండ్రుల గానక తనదు సతిని
పుత్ర వాత్సల్య మునతిగబూన నెట్లు
ఈ షణత్రయ వారిధి నీద గలరు.
5 ఉదర పోషణము
ఆ .వె, . .ఉదర పోషణా ర్థ మూడిగ ముంజేయు
సదరు జనుల కెపుడు సరస నుండు
అదురు బెదురు యున్న అన్నమేగతి పుట్టు
ఖదరు తోడ దొరుకు ఖాద్యమిలను
మ.. ఒకచో బిచ్చము నెత్తుకొందు రొకచో నొప్పారగా చౌర్యమున్
నొకచో సంత చరించు నొక్కొక తరిన్నొ ళ్ళోంచి కష్టించుగా
నొక చో సేద్యము జేసినన్ మరి యు తా నుద్యోగమున్ జేయ పో
వొకడు నేవిధమైన గానుదరమున్ పో షించగామానవు ల్
పోషించగా నిమ్మహిన్
కడుపు నిండి యున్న కవితలు కమ్మన
కడుపు నెండు వాన్కి కైత లేల
కడుపు నింపు కొరకు కాయ కష్టము జేయు
కవిత గూర్చి కలను గాన బోడు
కడుపు నెం డు వారి కవితలు చెప్పుచు
కడుపు నింపు కొ నెడు కవులు గల రు
కడుపు నిం ప కున్న కైతలే మి టికి నీ
కడుపు నింపు కవి త కవిత గాని
పక్షి పెంద లకడ పరుగును తీయును
కుక్షి నింపు కొరకు కుర్ర తతికి(పిల్లలకు)
కడుపు నింపు కొరకు కటకట లే లరా
కష్ట పడిన నిండు కడుపు నీది
అంశం:ఊరే నయం
సంఖ్య:6/6
పేరు: జన మంచి ఫణీంద్ర
****"********************
అరె ఏం జెప్పాలే రా రాముల ..!!ఉర్కుల పరుగుల పట్నం కన్నాపుర్ సత్ గుండె పల్లెలే నయంపొద్దుగాల పాల సంది పొద్దుమీకిబువ్వవరకు అన్ని సొక్కంగ దొర్కు తయికల్తీ లేని పాలు , పెర ట్ల నే పండే కూర గాయలుకరాబు గాని గాలి, కల్మషం లేని మనుషులుఆప తి కి,సం పతి కి ఆదు కునే టొ ల్లుపల్లె కడుపు జూస్త ది, పట్నం జేబు జూ స్త దిదినాం దొరికే కూరగాయలు,తోట్లనుంచి తెంపితొడిమలు తోనే అమ్ము తరుఎవ్వలింట్ల లగ్గమైనా ఎగేసుకొని వొచ్చి.అన్ని మీదే సుకొని , ఎ ల్ల దీస్త రుపసుపు లు ముట్టుడు కాన్నించిపదా రు పండుగ దాకాకని పట్నం ల ,పెండ్లికి గంట ముంగ టగంట తర్వాత ఎవ్వలన్న కనవడి తె ఒట్టుకొత్త పెట్టుడు నుంచి, కొత్త పండుగ లన్నిసంక్రాంతి అయినా , దసరయినపల్లె టూర్ లనె మజా గుంట దిఅక్క బావ, అన్న, తమ్మి,కాక, అనిపాయిరాం తోటి పిల్సుకుంట రువదిన, మరదళ్ల పరాచికాలుబావ బామ్మర్డుల మర్యాదలఎవలింట్ల కులపోల్ల సావైనపీ నగ నుంచి పిట్టకు వెట్టేదాకతోడుం డి దైర్న ము జెప్తరుఎవళింట్ల పంచాయతీ అయినాసుట్టుపక్క లోల్లే తశ్వ జేస్త రుపచ్చటి పొలాలు,పండ్ల తోటలుసల్ల టి గాలి, సక్కటి మను సుల
ఇంకేం గావలే ,మనిషికి బస్ గింత కన్న
అందుకనే. పట్నం కన్న ఊరే నయం
-
6 ఎవడిగోల వాడిదే
సీ!!
జలజల పారుతూ ఝరులుసవ్వడిసేయు
జలపాతములు నేల జారు హోరు
కుహు కుహు గీతాల కోయిల కూతలు
కావుకావు మనుచు కాకిగోల
కిలకిల మనుచును కూసేటి పక్షులు
తెల్లవారిన దని తెలుపుగోల
నిండిన చెరువుల దండిగా చేరిన
కప్పల బెకబెక కలకలములు
కిచకిచకిచ మంటు కీశ సమూహమ్ము
అంబ నంబాయని యరుచుపశులు
కొక్కరకో యను కోడి కూతలు లేప
మేకల మందలు" మే" యనంగ
తే! గీ!!
అన్ని జీవుల నాదాలు నవని నిండ
పరవశింపగ జేయుచు ప్రకృతి నంత
మనసు నాహ్లాద పరిచేటి మధురహేల
గోల కాదది పరమేశు లీల! వినుమ
పదవతరగతి పరీక్ష లో ప్రథమముగ
రాష్ట్రము న నిలువ రావు గోల
ఎటులైన పిల్లల నేమైన జేసియు
పాసు చేయించ గా పాడు గోల
శత శాత ముత్తీర్ను లను జేయ జూడగా
విద్యాధికారి చే విషమ గోల
పెద్ద సారు మనకు పెద్దగా చెప్పుతూ
అదనపు క్లాసుల నరయ రుద్ద
తే .గీ //
పాఠములకం ఠ పాఠము పట్ట గాను
ఛా త్రు లెవరును బుద్దిగా చదువ రా యె
ఏమి చెప్పు దు గురువుల కెన్ని వెతలు
ఎవరి గోల ను వార లు నేడ్వ వలయు
7 ఏమరుపాటు
సంఖ్య: 8/8
నిర్లక్ష్యం,నిర్లిప్తతనిర్వేదం,నిస్తేజంనిద్రాణం, నిసత్తువఇవికావా, ఇవికావాఏమరుపాటు కు హేతువు
అజ్ఞానం,అలసత్వంఅశ్రద్ధ,అహంకారంఅల్పత్వం,అన్యత్వంఅవగాహన రాహిత్యంఐవికావా,ఇవీకావాఏమరుపాటుకు మూలంనీ బాధ్యత రాహిత్యంనీస్వార్థం, నీమౌఢ్య మునీసౌఖ్యం, నీలౌక్య ముఇవికావా, యివికావాకారణ మేమరుపాటుకుజాగురుకతతో ఉంటేనువు బాధ్యతగా ఉంటేసామాజిక స్పృహ గలిగినీవారిని ,నీపొరుగునిప్రతి ఒకరు,నావారనిప్రతి ఒకటి నాదేననుసమ భావన నీకుంటేసేవా భావము తోడుతనువు కాస్తా మసలుకుంటేఎక్కడుండు, ఎక్కడుండుఎక్కడ, ఇంకెక్కడుండుఏమరుపాటెక్క డుండుప్రతి ఇల్లు,ప్రతి పల్లెప్రగతి తోడ వెలుగు చుండు
✍️✍️✍️జనమంచి
🚩 రామంభజేశ్యామలమ్🚩
👨🎤 హృద్యపద్యం-- కవితావితానం
నాపేరు:- జనమంచి ఫణీంద్ర
నాకవిత/పద్య సంఖ్య:-09
అంశము;సంఖ్య 09
:- ఐందవీయము
#ఉత్సాహ వృత్తము#చల్ల నైన తల్లి వీ వెచదువు నిచ్చు శారదాఎల్ల విద్దె లిచ్చి మాకునీప్సి తముల నీయవేకొల్ల లుగను శక్తి నీవెకోరితి నిను భారతీఉల్ల మందు నిల్చి మమ్మ
నొల్ల కుండ గావుమా
ఉత్పల మాల
కొందరుపండితోత్తములుకొందరుభవ్యవధానశేఖరుల్
కొందరుగానకోయిలలుకొందరుపూజ్యగురూత్తముల్ కవుల్
కొందరు చిత్రరంగమున కొందరు సద్గృహిణీ సుధీమణుల్
కొందరుభూసురోత్తములుకొందరు సంస్కృతసాహితీ ప్రియుల్
అందరు! యీసమూహమున ఐoదవి! నీవిభవమ్ము చాటగన్
[3:10 PM, 4/29/2020
ఒజ్జ ఘనత
శ్రీకృష్ణ పరమాత్మ శ్రియము గాజెప్పెనుజగమునకున్ గీత జగతిగురువువేదపురాణాలు వివిధోప నీషత్తులొసగెను వ్యాసుడు లోకమునకుఆదిశంకరులిచ్చె స్తోత్రాలు భాష్యాలువిశ్వగురువయితా వెలుగు నిచ్చెధరయందు నిలుపగా ధర్మము నిరతముఈశ్వరాంశనుబుట్టి రీగురువులుగురుపరంపర సాగుతూ గురుత గాంచిమార్గ దర్శకులైనారు మహిని గాచభరత భూమిని గురువుల పాత్రయెంతొఘనము గానుండె తరియింప గతమునందు[3:10 PM, 4/29/2020] Phanindra J:
తేటగీతి
ఒజ్జ యెబ్రహ్మ రూపము నుర్విగనగఒజ్జ యేవిష్ణు రూపుడు సజ్జ నుండుఒజ్జ యెమహేశ్వ రుండును ముజ్జ గమునఒజ్జ యెపరబ్ర హ్మమిలను నొజ్జ ఘనుడుయొజ్జ కునమస్సులిడుదును యోగ్య ముగను[3:10 PM, 4/29/2020] Phanindra J:
కందం
గురువులు తరువులు మనకునునిరుసిరు లుకనగ సతతము నిజముగ ధరయున్పరులకు హితమును గరపగ
బరువెరుగరు తమయెడ గల ఫలముల నిడగన్
పేరు :జనమంచి ఫణీంద్ర
అంశం:ఓం(ప్రణవం)11/11 గీతము
******
ఓంకారమేప్రాణము,
ప్రణవమేజీవమూ
నాదాత్మకము,వేదాత్మకము విశ్వవ్యాపకమూ !ఓం !
పంచభూతములందు,
శబ్ద స్వరూపము
స్పర్శ రూప రస గంధరహితము
ఆకాశాత్మక,సర్వవ్యాపకము
అఖిలజగతికీఆధారమూ // ఓం//
బ్రహ్మముఖము నుండి
భానుడి హృదినుండి
శివుని తాండవ కేళి
కాలి అందెల నుండి
ఉద్భవించినశక్తి జగదోధ్ధారకము.
//ఓం//
మేఘ గర్జనయందు
శంఖనాదము నందు
సింహ వ్యాఘ్ర,గజ
మహిష స్వనమందు
శుక,పిక,కోకిల కలరవమందు
ధ్వనియించెడిదీ
దివ్య గానము. /ఓం/
సర్వవేదములకాదియై చెలగి
అన్నిమంత్రములకాధారమై వెలిగి
కుండలినీ పద్మ చక్రరాజములను
జాగృతమొనరించు
యోగనాదస్వరము. //ఓం//
ప్రకృతి జనితం ప్రకృతిమిళితం
ప్రకృతిభరితం.ఓంకారము
ఉఛ్ఛరించిన అంతశ్శుధ్ధి.సాధనచేస్తే కలుగనుసిధ్ధి.
ఓంకారమెశక్తి,ఓంకారమె ముక్తి
ఓంకారమే ...సర్వ సృష్టి.
…/ఓం/
శ్రీరామభారతి
…
…





కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి