26, జూన్ 2025, గురువారం

బతికియున్ననాడు

బతికియున్న నాడు బాగోగు లడగక
చచ్చినాక బెట్టు శ్రాద్ధమేల
పిడిక డన్నమిడక పిండంబుబెట్టిన
ఫలములేదుపొంద పరమగతులు

🚩రామం భజే శ్యామలం🚩
***************************
పేరు: జనమంచి ఫణీంద్ర
అంశము : వరము
సంఖ్య:  34
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

ఆ.వె.
మనుజ జన్మ వరము మాంగల్యమేవరమ్
పిల్లపాప లనిన పెద్ద వరము
అంత కన్నవరము ఆయురారోగ్యముల్
దేవుడిచ్చునట్టి దివ్య వరము.

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...