మనుషులుజావగ వ్యాధిన
తనకేమియుపట్టనట్లు దర్పముతోడన్
కనకపుసింహాసనమున
శునకముతీరున ప్రభువులు జూడగ తగనా
సప్త ఋషుల తపము శాసించు సృష్టిని
శూన్యమందు వెలుగు చుక్క లోలె
వారి వంశజులిలను బ్రాహ్మణ వర్గము
గోత్ర మందు తెలియు గుర్తు బట్ట
అరిషడ్వర్గములన్నియు
సరియాకలిపురుషునికినిసంతానములే
హరియించునుసద్గుణముల
పరుగెత్తకువానివెంటపతనము జూపున్