16, ఆగస్టు 2025, శనివారం

ముదిమి

యుక్తవయస్సునన్ సకలయోచనలన్నియుసంతుకోసమే 

శక్తియెబోవగన్ తనువశక్తతతో గదులందుబందియే

రిక్తపుహస్తముల్ కొడుకులిచ్చెడుదూషణభూషణమ్ములే

ముక్తినిగోరుచున్ ముదిమి మోక్షమునొందు నిరీక్ష సల్పెడిన్


భారత నాట్య ప్రతిభ

ఉ.
ఆంగికవాచికాభినయమధ్భుతరీతిననృత్యమందునన్
భంగిమలెన్నొజూపితనువంగగ యోగము నొందగా మదిన్
రంగమునందుసేయునటరాజునితాండవకేళిజూడగన్
పొంగునుమానసమ్ముపరిపూర్ణసునాట్యకళావిలాసమున్
       ✍️ జనమంచి ఫణీంద్ర🐍

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...