14, జనవరి 2026, బుధవారం

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు*

👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦

సీసమాలిక

**********

వంశవృధ్ధినిజేయు వంశాంకురములను

నెలలుతొమ్మిదిమోయు నెలత తల్లి

జన్మనిచ్చియుపెంచి జవసత్వమంతయు

ధారబోసెడిజీవితల్లియొకతె

బిడ్డలందరికినివిద్యలజెప్పించి

ఉన్నతులనుజేయునుత్తముండు

సంఘరీతినిదెల్పి సత్ప్రవర్తననేర్పి

అండదండగతండ్రి యుండుమనకు

పెళ్లిళ్లు పేరంట మిళ్లువాకిళ్లను

సమకూర్చు సవనాన సమిధ నాన్న

తనుకష్టపడిననూ తనయుల వృద్ధికై

అహరహము తపించు ఆత్మ నాన్న

  తే/గీ.

ఒకరుజన్మనిచ్చుబతుకునొకరునిచ్చు

తల్లిదండ్రులుమనకిలతొల్లి వేల్పు

పంచుకోబోకుముదిమినివంతుబెట్టి

వారిసేవించి దీవింప వాసికెక్కు .

                శ్రీరామభారతి



తృప్తి

టుంగుటుయ్యాలలో డోలలూగగతృప్తి

తండ్రి మోకాళ్లపై తనరుగాదె

విస్తరాకుల నుండు వేడి యన్నపు తృప్తి

వెండికంచములందు యుండ బోదు

మేడలందున లేని మిక్కిలిమోదము 

పూరిగుడిసెనైన వుండుగాదె

అందమెంత నున్ననుయంగన సౌఖ్యము

అనుకూల వతియైన యతివ నిచ్చు

ఆ!!వే!!

ఎన్ని యున్ననేమియేమితిన్ననుగాని

మేడ మిద్దె లున్న మిగుల ధనము

సుఖము గనగ  లేము సొమ్ములున్ననుగాని

తృప్తి తోడ బతుకు తృష్ణ లేక






తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...