21, సెప్టెంబర్ 2022, బుధవారం

డబ్బు

డబ్బులెజీవనమ్మునకుడంబపుశైలికి దారితీయుగా
డబ్బులె పెంచునెంతగను డాబునుదర్పము సంఘమందునన్
డబ్బులెకారణమ్మునగు టక్కరిమోసము లెన్నొచేయగన్
డబ్బుయెమూలమౌ జగతి డబ్బులెతీర్చునభీష్టమంతయున్

త. భ. య. జ. స. ర. న. గ. 
శ్రీవాణిభారతినిసేవింతునేమదినిశ్రీకారరూపజననీ
భావమ్ములోనిలిచిభాగ్యమ్ములీయగనువాగీశ్వరీకరుణతో
సావిత్రివైసకలసంసారవిద్యలకుసామ్రాజ్ఞిగావెలుగుచున్
మావాక్కులందుననుమాచిత్తమందుననుమమ్మేలు
శారద దయన్

అమ్మా ని న్ను తలం చి పద్య మునునే నారంభమున్ జేసి తీ

రమ్మానా దుమదిన్ ముదమ్ము తొదయన్ రక్షించ వేగమ్ముగా

కొమ్మానా వినతిన్  ప్రసన్నమతి చే కొమ్మా ప్రణా మమ్ము లన్

ఇ మ్మా నీ పద సేవ భాగ్యమును మా కీ డేర గా కోరి క ల్




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...