4, మే 2022, బుధవారం

సుప్రభాత పద్యాలు

శివుడు

సుప్రభాతమిదియెశూలపాణీశివా!

సుప్రభాత వేళ జోతలిడుదు

సుప్రభాత సేవ సూనశరసంహార!

సుప్రభాతముగొను సుందరేశ!

🌷

శ్రీ హరి

సుప్రభాతముమధుసూదనా!శ్రీ హరీ!

సుప్రభాతవేళ నప్రమేయ

సుప్రభాతసేవ స్వప్రకాశామీకు

సుప్రభాతమబ్జసూన హస్త

🙏🙏🙏🙏🙏🙏

ఆంజనేయుడు

సుప్రభాతమిదియె సుందరకపిరాజ

సుప్రభాత వేళ సూర్యతేజ

సుప్రభాతసేవ సురలోకపూజితా

సుప్రభాతముగొను శుద్ధ తత్వ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...