కం.
ఉత్తరద్వారమునుండియు
ఉత్తారణుడేగుదెంచవూరేగగనే
చిత్తమునిల్పగ జూచిన
ఉత్తేజితమౌనుమేనునుత్సాహముతోన్
ఉత్తారణుడు=సంసారసముద్రందాటించేవాడు
విష్ణువు
ధనము గల్గువాడుదగ్గినా వార్తనే
పేదవాడి చావు విలువ లేదు
సీసము.
శృంగేరి పురములో చిద్రూపముగవెల్సి
ఆత్మ జ్ఞాన మిచ్చుయమృతమూర్తి
ఆదిశంకరులచేఆదిపీఠముగాను
దక్షిణామ్నాయమైస్థాపితముగ
శారదామాతగా సకలవిద్వద్జ్ఞాన
రూపిణిగానిట లోకమందు
హైందవధర్మమునార్షసంస్కృతులను
పాటించి కాపాడ పాటుపడుచు
తే.గీ.
వేద సంస్కృత భాషలు విస్తరించఁ
జ్ఞానసముపార్జనలజేయ జగతియందు
చేరికొలిచెడి వారికి శ్రియముగూర్చు
శారదామాత మాకివ్వు శరణుశరణు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి