[10/6/2020, 4:08 PM] Phanindra J: పచ్చ గడ్డికోసుకొనియు పడుచుపిల్ల
పైట కొంగుచెక్కంగనువాటముగను
మోపునెత్తుక చిరునవ్వు మొమునొలుక
రైతుకులమున బుట్టిన రత్న మామె
[10/7/2020, 10:03 PM] Phanindra J: దేవుడోదేవతయెనేమొ సేవమీద
బ్రహ్మచారులుమోయగా బాహువులనుఁ
వామనులరీతి తోచిరివారలంత
హైందవమతపువేడుకనాచరించ
[10/18/2020, 9:02 PM] Phanindra J: పిడుకలనిన నేడు పేరుకైననులేవు
పల్లెటూళ్లఁలేవుపశువు లతిగ
గోడమీద గొట్టికుచ్చెలుగాపేర్చి
వాడుకొందురెపుడుపల్లెలందు
[10/20/2020, 5:43 PM] Phanindra J: చెట్టుపెంచినంతచేదోడువాదోడు
ఉండునెపుడుమనకునుర్వియందు
వరదలోనయవ్వ పరుగునెత్తగలేక
చెట్టుమీదికెక్కి సేదదీరె
[10/20/2020, 6:18 PM] Phanindra J: *అవ్వ చెట్టునెక్కెనాటకొరకుకాదు*
*వానగురిసిబాగవరదరాగ*
*ప్రాణములతొతాను బయటపడంగాను*
*సాహసమును జేసె సబలననుచుఁ*
[10/27/2020, 11:31 AM] Phanindra J: పూలనమ్ముకొనుచు పుస్తకములబట్టి
పిల్లవాడునేర్వ విద్య లన్ని
బతుకు నవును పూలపానుపువోలె
కష్టపడగదీరు కామితమ్ము
[10/27/2020, 11:53 AM] Phanindra J: మ్లేచ్ఛవనితసుతునిమిక్కిలి ప్రేమతో
బాలకృష్ణుజేసె భక్తిమీర
మతము పైన లేక మౌఢ్యభానవనమ్ము
దారిజూపె తాను దారి నడిచి
[10/29/2020, 11:59 AM] Phanindra J: పాముతొసెల్ఫీదీయుచు
కామితమునుదీర్చుకొనగ గర్వముతోడన్
ఏమైనాయటమటముగ
పామేనీపాలిమిత్తి పయనమెదివికిన్
[10/30/2020, 8:49 AM] Phanindra J: బండివెనుక సీటు భార్యలిద్దరునెక్క
వెసులుబాటుజేసె పెనిమిటివగఁ
సతుల భారమంత సమతౌల్యమునుజేసి
బతుకు,బండినడిపె భర్తగాను
[10/30/2020, 2:29 PM] Phanindra J: ఈకరోననుదునుమాడుటెవరితరము
అనుచుచేతులెత్తిమనము హాయిగాను
మాస్కు లేకను తిరిగిన రిస్కువచ్చు
పెళ్లిపేరంటమనుచును విరివిగాను
తిరుగ తగులుకరోనయె తీయునుసురు
చేతనున్నదిమనచేష్ట చేదు నిజము.
శ్రద్ధజాపుమారోగ్యపు బుద్ధితోడ
కఠిన చర్యలవలననే కలుగు ముక్తి
[11/1/2020, 9:06 AM] Phanindra J: రామం భజే శ్యామలామ్
***********************
అంశం:మానవత్వము
పేరు:జనమంచి ఫణీంద్ర
సీ//
అన్నిజీవులపట్ల ఆరాధ్యభావము
జీవకారుణ్యము సేవగుణము
తానుఘనుడనని దానవత్వముచేత
పీడించు గుణమునేవిడిచి పెట్టి
బాల స్త్రీవృద్ధులబానిసలుగగాక
జాలిగుండెనుగల్గి సాధురీతి
సాటివారికికొంతసాయమందించగ
కష్టసుఖములందు కలిసినడువఁ
ఆ.వె.
మానవత్వమనెడుమహితగుణముతోడ
మాన్యుడయ్యెవసుధమానవుండు
సృష్టిలోన బ్రహ్మ సృష్టించెమనిషిని
బుద్ధిజీవిగాను వృద్ధిజెందఁ
[11/1/2020, 9:25 AM] Phanindra J: గునుగు'తంగేడు ల మనువు చాల బాగుంది.
వేడుకతోడుతన్జనులుపేర్వగలేవుగపూవులెక్కడన్
జాడనులేవుగా గునుగు చక్కనితంగెడు చేనులేగనన్
పాడవనట్టికాగితపు బంగరురంగుల కూర్చినట్టియా
వాడినపూవులే దగునుభామలకున్ బ్రతుకమ్మ పేర్చగన్
[11/12/2020, 10:23 AM] Phanindra J: భక్తుడు ప్రహ్లాదుని యా
సక్తిగ జూచినరసింహ స్వామియె ప్రేమన్
శక్తిని వీడియు దయనను
రక్తినియొడిలోనజేర్చి లాలన జేసెన్
[11/13/2020, 9:38 AM] Phanindra J: తులసీ దళమున్తను తూగెనుగా
అలరుక్మిణిభక్తికి యావిభుడే
చెలిసత్యయెతూచెను శ్రీలనిడిన్
పలుసంపదలుంచెను పళ్లెములో
హరిభక్తిగగొల్చిననందునుగా
సిరిసంపదలేమియుచేయవనిన్
హరిదాసులపాలిటియాస్తియనిన్
హరియించెనుగర్వమునాసతికిన్
[11/13/2020, 12:53 PM] Phanindra J: కొంగ జపములాంటి గొప్పసాయముసేయ
పాముచేప నొడ్డు వదిలిపెట్ట
పథకమొకటివేసె భక్షించు నెపమున
ప్రాణభిక్షకాదు పాడుగాదు
[11/15/2020, 8:31 AM] Phanindra J: లక్ష్మియమ్మవారులక్షణముగరాగ
దీపహారతులనుదివ్యభక్తిఁ
అత్తకోడ లిచ్చియాహ్వానమునుబల్కి
పిల్లలంతమురిసి వేడుకొనిరి
[11/16/2020, 2:13 PM] Phanindra J: పాండవులైదుగుర్ మరియుపత్నియుద్రౌపదిగూడిపూజలన్
నిండగుమానసమ్మున
నునిశ్చలభక్తినినీలకంఠుకున్
దండిగజేసిమొక్కిరట దారుణకాననవాసమందునన్
మెండుప్రతిష్ఠలన్జరిపిమేలుగగట్టిరి మందిరమ్ములన్
[11/20/2020, 9:15 PM] Phanindra J: రామనామఫలమురమ్యమైనఫలము
మామిడిఫలమంతమధుర ఫలము
రామముద్రికజూడరాజిల్లెఫలముపై
ఫలము నుండిగ్రోల భక్తిరసము.
🚩రామం భజే శ్యామలం🚩
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
పేరు:*జనమంచిఫణీంద్ర*
అంశం: సంఖ్య: డబ్బు(23)
###################
ఉత్పలమాలిక
***************
డబ్బులెజీవనమ్మునకుడంబపుశైలికి దారితీయుగా
డబ్బులె పెంచునెంతగను డాబునుదర్పము సంఘమందునన్
డబ్బులెకారణమ్మునగు టక్కరిమోసము లెన్నొచేయగన్
డబ్బుయెమూలమౌ జగతి డబ్బులెతీర్చునభీష్టమంతయున్
డబ్బదివస్తువాహనపుటక్కరదీర్చగ కూడబెట్టగన్
జబ్బులవైద్యమందధిక శాతముడబ్బును ధారపోయు నా
డబ్బున కొంతభాగమును ఠక్కరుసేవలఖర్చుసేయగా
డబ్బునుదానధర్మముల డబ్బునుబీదలకందజేయుచున్
అబ్బుర పుణ్యమందుచును యధ్భుతకీర్తిని పొందుమా భువిన్
✍️✍️ శ్రీరామభారతి
[3/19, 10:09 PM] Phanindra J: మ.కో.మా
వేగలేనురనీదునల్లరివెన్నదొంగతనమ్ములా?
సాగవింకనుదాగవింకనుచాటుమాటగుచేష్టలున్
పోగుచేయగగోపబాలురపూనికొంటెతనమ్ముకున్
వేగజూపుమునోటమన్నునువేడ్కతోడనుతింటివా?
రాగమెత్తగగోపకాంతలురాగజూతువమాధవా?
భోగభాగ్యములన్నియుండకుబుద్ధులేలర కన్నయా?
[3/19, 10:10 PM] Phanindra J: చం.
అరవపుపిల్లజూడనిటనందముచిందగ
నిల్చెముంగిటన్
పరువపుఛాయలొల్కపలువన్నెలవాల్జడపట్టువస్త్రముల్
కరమునబిందెబట్టినయగారపుజూపులునాట్యమాడగన్
మరులనుగొల్పునేతనువుమానసమున్ నవయవ్వనాళికిన్
సవరణతో
[3/19, 10:12 PM] Phanindra J: ఆ.వె.
లాకుడౌను లోన రక్షకభటుడొక
పిల్లికూన నరవ బేలగాను
పాలుదెచ్చిపోసెపాపమనగతాను
కష్టకాలమందు గాచె దానిఁ
[3/29, 10:26 PM] Phanindra J: *భారత* దేశసంస్కృతి నిబాధ్యత తోడుగ నిల్పగానిలన్
సారముగల్గు *విద్య* లగుసంస్కృతవేదపురాణశాస్త్రముల్
భారము నెంచకన్ చదివి పావన *శంకర* రూపులై సదా
చారములన్నిచాటు యతి *స్వామిని* పుష్పగిరీశుమొక్కెదన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి