9, జనవరి 2021, శనివారం

[9/17/2020, 6:07 PM] Phanindra J: రంగవల్లినివేసినా లక్షణముగ
రంగ పురవిహారాయని రాగమెత్త
పాడి నాసుబ్బలక్ష్మియె పాటు పడెను
సంప్రదాయ,సంగీతము జంటగాను
[9/17/2020, 6:07 PM] Phanindra J: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా
********************

*నైజామురాజ్యమిచ్చెను*
*రాజీ పడగనునవాబు రాఫిడు ఫోర్సున్*
*రాజులపాలనపోయెను*
*బాజాప్తాగలిసెనంత భారతప్రభుతన్*
[9/17/2020, 6:07 PM] Phanindra J: తెలంగాణ విమోచన దినోత్సవం గూర్చి..

ఉద్యమకాలమునందున
ఉద్యుక్తుడుగానుజెప్పెఉసిగొల్పుచుతాన్
విద్యుక్తధర్మమిప్పుడు
సద్యోరీతిన జరుపగ స్వాతంత్ర్య మునన్
[9/19/2020, 2:07 PM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
***************************
పేరు: *జనమంచి ఫణీంద్ర*
అంశము : *పరోపకారము*
సంఖ్య:  27
^^^^^^^^^^^^^^^^^^^^^^^
తేటగీతమాలిక
##########
*శిబిధధీచియె కాయముచీల్చియిచ్చె*
*వెన్నుపూసయుమాంసము ప్రేమతోడ*
*కర్ణుడిచ్చెకుండలములు కవచములును*
*రంతిదేవుడొసగెనున్నదంత ధనము*
*ఆకలిగొనువానికొసగెయన్నమంత*
*త్యాగబుద్ధిని తరియించె ధరణిలోన*
*ఇవ్వగలిగినదేదైన ఇతరులకును*
*దానధర్మమ్ముజేయగా దాతయగును*
*పరులకుపకారమునుజేయ వాసిదక్కు*
*పరమ ధర్మమ్ము నరులకు పాటుపడగఁ*
[9/19/2020, 2:07 PM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
***************************
పేరు: *జనమంచి ఫణీంద్ర*
అంశము : *ఫలము*
సంఖ్య:  28
^^^^^^^^^^^^^^^^^^^^^^^

*సీసము
ఫలముఫలములందు  ఫలమేది తియ్యన?
రామనామఫలమురమ్య ఫలము.
ఫలముఫలములందుభక్తినిచ్చును యేది?
విష్ణుభక్తియనెడు ప్రీతి ఫలము.
ఫలముఫలములందువైరాగ్యఫలమేది?
శివనామ స్మరణయే శీఘ్ర ఫలము
ఫలమేదిసౌభాగ్యఫలమిచ్చుభువిలోన?
మంగళగౌరిచ్చు మహిత ఫలము.
ఆ.వె.
ఎవడికర్మఫలముయవనిలోననువాడు
అనుభవించుగాదెననవరతము
పుణ్యఫలముదక్కుపుణ్యకర్మలుసేయ
పాపకర్మలందుపాపఫలము
[9/23/2020, 2:19 PM] Phanindra J: భుజగనాథుడెక్కెభుజములపైయన్న
గణపతి,గుడిలోన గంట గొట్టఁ
తాను తలచనెక్కు తనమయూరమ్మునే
అన్నదమ్ములనెడు అండ గోరెఁ
[9/23/2020, 8:01 PM] Phanindra J: అన్నా అందుటలేదే
చిన్నారినిగాదెనేను చేతికి గంటన్
చిన్నగనెత్తుముకొంచెము
మిన్నౌనాగంటగొట్టఁమీదయచేతన్
[9/27/2020, 6:38 PM] Phanindra J: ధనము కూడ బెట్టి దానమ్ముసేయుచు
దారసుతుల కొరకు దాచు కొనక
ఈష ణత్ర  యమ్ము నిలలోన విడిచిన
నీశు పదము దొరుకు  నింపుగాను

దాన ధర్మ మ్ము జేయక  ధనము దాచి
తల్లి దండ్రుల గానక తనదు సతిని 
పుత్ర వాత్సల్య మునతిగబూన నెట్లు
నీషణత్రయ వారిధి నీద గలరు.

బడిపలుకులభాష బడిచదువునకు
పలుకుబడుల భాష పలుక మనకు
నీదుభాష నీకు నీఛమైఉండెనా
మాండలికము మనము మరువ వద్దు
[9/27/2020, 6:40 PM] Phanindra J: కనగాకన్నులపండువౌ రథమునన్కైవల్యదాతారునిన్
వినగా వింతలు శ్రీపురిన్ విశదమౌవిజ్ఞానమైనట్టివిన్
వనమున్ దెచ్చినదారుతో మలచగావాత్సల్య రూపమ్ముతో
జనమున్ గావగ జాగుసేయకుము ఈశా!శ్రీ జగన్నాథుడా!




నీలమాధవకేశవా హరినిన్ను నమ్మితి బ్రోవుమా
కేలమున్ గిరినెత్తిగాచియుఖేదమంతయుదీర్చగా
వేలమందియెనీరథమ్మునువేడ్కతోడను లాగగన్
జాలమేలదయానిధీమముజాగుసేయక గావుమా



బలభధ్రుండుసుభద్రతోకలిసిసొంపారన్ జగన్నాథుడై
యిలపైశ్రీపురియందునన్వెలిసినావీదారు రూపమ్ముతో
పిలుపున్ పిన్నమచెంతకున్వెడలగా పేరైనయా తేరులన్
పలుపున్ లాగినపుణ్యమౌముదముతోపాపాలనే బాపగన్

అవతారములెన్నగయధ్భుతమౌ
శివమంతయుగూర్చగ చిన్మయమౌ
భవబంధములన్నియుబాపువిభో
కవనమ్ములురాయుదుగావుప్రభో

కమలమ్మున బ్రహ్మయెకాంతులిడన్
రమయేపదసేవనురాజిలగన్
తమశేషుడెమారెనుతల్పముగన్
నమకమ్ములుసేయుదునాదుకొనన్
[9/28/2020, 8:50 AM] Phanindra J: తొలివలపుతలపుల తోనెలతయె
చెలువమునొలుకుచునుచిరునగవున
వలచినచెలికానిపలుకులు మదిలోన
గరికకరము బట్టికదల జూచెఁ
[9/29/2020, 12:23 PM] Phanindra J: మట్టెలేయమనియె కట్టెకాలికియవ్వ 
అవిటిదైనగాని యందముగను
లక్షణమ్ము నదియె రక్షగానుండును
ముత్తయిదల కునవి మూల్యసిరులు

నేటి వనిత లకవిమోటుగా దోచునో
మట్టెలనిన వేయ గిట్టదాయె
అవ్వ జూపె నడువ తొవ్వను వారికి
అవిటి తనువు గాని ఆత్మ గాదె

అంగ వైకల్యమెంతయూ అడ్డురాదు
పుస్తె మట్టెలు ధరియుంచ పుణ్య స్త్రీకి
అయిద వతనమె ఆస్తిగా యతివలకును
అదియె పోయిన నాడింక నంత సున్న.
[9/30/2020, 9:10 PM] Phanindra J: ఓరిభడవనీదు నుత్తమ మార్గమే
పడవ బెట్టి నావ పాంథులకును
భాగ్యనగరమందు భారీగ వానలే
వరద దాటవేయవారికొరకు

విశ్వనగరమిదని విర్రవీగేవారు
భాగ్యనగరి స్థితిని బాగ గనుడి
వానలొచ్చిపారెవరదలై రోడ్డులే
పడవ రోడ్ల పైన నడుప గాను
[10/1/2020, 8:55 PM] Phanindra J: డడ్డనికడమ్మనుచునూర డప్పు గొట్టి
టముకు వేయగ తిరుగుచూ డాబుతోడ
వార్తలన్నియుదెలుపును బాధ్యతగను
గ్రామ పంచాయితీలందు 
కానమిపుడు
[10/2/2020, 2:35 PM] Phanindra J: సత్యదేవవ్రతమహత్మ్యము
******************

బీదబ్రాహ్మణుడేదరిద్రమునతాపీడింప రోదించగా
సాదాసీదగసత్యదేవు వ్రతమున్ సద్భక్తితోజేయగన్
బీదత్వమ్మునురూపుమాపెహరియేప్రీతిన్సదాబ్రోవగన్
శ్రీదేవీయుతుడైయొసంగెసిరులన్ శ్రీసత్యదేవుండునై
[10/2/2020, 4:47 PM] Phanindra J: కలియేతాండవమాడగావసుధలోకామాదిషడ్వర్గముల్
బలియైపోయెనుబాధలన్ జనులహోపాపలనేజేయుచున్
ఫలమున్యిచ్చునుసత్యదేవవ్రతమేవర్థిల్లగాసత్యమే
బలమున్గూర్చును భక్తిచే గొలవగా పాలించు నారా
[10/3/2020, 6:30 PM] Phanindra J: *హిమజ* జేసె తపము ఈప్సితమీడేర
హిమ *గిరిజ* పమందుఈశుడుండ
సతి *మహిజ* నియించె శంభునిజేరగా
*జలజ* నాథు సఖిగజన్మమెత్తెఁ
[10/4/2020, 6:53 PM] Phanindra J: తల్లీనిన్ను దలంచుకోగ మదిబాధన్గల్గునేభారతీ
ఎల్లల్లేవుగనీదుప్రేమదయమాకీజన్మలోదక్కెనే
పిల్లల్మాకిపుడేమిలేదుగదసేవించంగ నేభాగ్యమున్
తల్లీనీకిడ నర్ఘ్యముల్విధిగశ్రాద్ధమ్మేగయేడాదికిన్
                                                  382020
[10/4/2020, 7:01 PM] Phanindra J: 🚩రామంభజే శ్యామలామ్🚩
*************************
పేరు: *జనమంచిఫణీంద్ర*
అంశం: భాగవతప్రశస్తి
సంఖ్య: 29
శార్దూలము:
''''''''''''''''''''''''
వేదవ్యాసుడు నాత్మతృప్తికొరకైవిష్ణ్వావతారమ్ములన్
మోదమ్మొందగరాసెభాగవతమున్ ముక్తిన్ప్రసాదించగన్
ఆదేశమ్ముదినారదుండొసగగన్ ఆవిష్కరించెన్మహా
ఖేదమ్మంతయుదీరుజుర్రుకొనశ్రీక్రిష్ణావతారామృతమ్
ఉత్పలమాల:
''''''''''''''''''''''''''
పోతనఘంటమున్ తెనుగు పోతనుబోసిన భక్తిరూపమై
చేతనమిచ్చుమానవులచిన్మయపూరితమౌషధమ్ముగన్
తాతలతండ్రులందరికి దార్శనికమ్మదిభావిజాతికిన్
ఏతరమైనభాగవత మీశ్వరరూపము జూడగానిలన్
         ✍️ శ్రీరామ భారతి

[5/7/2020, 2:22 PM] Phanindra J: కాల సర్పమ్ములేనాదు కంఠ మందు
నుండ నీవేల చింతతో నుండ వలయు
కర్కషమ్మగు క్రిమియా కరొన ద్రుంచ
భయము నొందకు నీవింక భరత వీర
[5/7/2020, 2:22 PM] Phanindra J: సురులసురులు కడలిచిలుక
దొరికెను సుధయును తమకనిదొడగిరి తగవున్
హరియరయగ యతివవిధము
సరిసమముగనిడుదుననియు సరసము జరిపెన్

ఇది నాసర్వ లఘు ప్రయత్నం
[5/7/2020, 2:22 PM] Phanindra J: కాల సర్పమ్ములేనాదు కంఠ మందు
నుండ నీవేల చింతతో నుండ వలయు
కర్కషమ్మగు క్రిమియా కరొన ద్రుంచ
భయము నొందకు నీవింక భరత వీర
[5/7/2020, 2:22 PM] Phanindra J: సురులసురులు కడలిచిలుక
దొరికెను సుధయును తమకనిదొడగిరి తగవున్
హరియరయగ యతివవిధము
సరిసమముగనిడుదుననియు సరసము జరిపెన్

ఇది నాసర్వ లఘు ప్రయత్నం


[6/1/2020, 6:21 AM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
         ******************* పేరు. :జనమంచిఫణీంద్ర
అంశం, గంగా నదిసంఖ్య:   15/15 
🕉️🕉️🕉️🕉️🕉️🕉️


గంగనుదైవభావమునగంధము పూవుల ధూపదీపముల్
రంగుల ప్లాస్టికున్ విషము రాక్షసరీతుల కల్మషమ్ముగన్
గంగను జీర్ణవస్త్రముల గల్పుచు నస్తులకుండలందునన్
పొంగగ  నుర్గులన్ నదుల పూరణ జేయుట మానవత్వమే

గంగల స్వచ్ఛతన్సదయ  గావగ పోరును జేయగావలెన్
హంగుల తోడుతన్మిగుల హారతులిచ్ఛుచు సుందరమ్ముగన్
భంగము పారిశుద్ధతకు వాటిలకుండగ జూడగావలెన్
రంగుల పూలతోటలను రమ్యత నేర్పడ నుద్ధరించుమా
        
 ✍️✍️  శ్రీరామ భారతి
[6/3/2020, 5:18 AM] Phanindra J: జయతు సంస్కృతమ్..

*సంస్కృతంలో పుష్పాల పేర్లకు అర్థాలు*

1.సేవంతికా = చామంతి
2.సూర్యకాంతిః = పొద్దుతిరుగుడు
3.మాలతీ = మాలతీ
4.వకులం = పొగడ
5.కమలం = తామర
6.జపా = మందార
7.జాతీ = జాజి
8.నవమల్లికా = విరజాజి
9.పాటలం = గులాబీ
10.నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి
11.కురవకం = గోరింట
12.ప్రతాపనః = తెల్లమందారం
13.శిరీషం = దిరిశెన పువ్వు.
14.ఉత్పలం = కలువపువ్వు
15.అంభోజం = తామర
16.సితాంభోజం = తెల్ల తామర
17.కుశేశయం = నూరు వరహాలు
18.కరవీరం = గన్నేరు
19.నలినం = లిల్లీ
20.శేఫాలికా = వావిలి
21.పున్నగం = పొన్న పువ్వు
22.అంబష్టం = అడివి మల్లె
23.జాతీ సుమం = సన్న జాజి
24.గుచ్చ పుష్పం = బంతి
25.కేతకీ = మొగలి
26.కర్ణికారం = కొండ గోగు
27.కోవిదారం = దేవకాంచనము
28.స్థలపద్మం = మెట్ట తామర
29.బంధూకం = మంకెన
30.కురంటకం = పచ్చ గోరింట
31.పీత కరవీరం = పచ్చ గన్నేరు
32.గుచ్చ మందారం = ముద్ద మందారం
33.చంపకం = సంపెంగ
34.కుందం = మల్లె
35.పుష్ప మంజరీ = పూలవెన్ను.

                   •••••
           సంస్కృతభారతీ,
         సిద్ధిపేట జనపదమ్.
[6/5/2020, 3:32 PM] Phanindra J: 🚩రామం భజే శ్యామలం🚩
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
పేరు:*జనమంచిఫణీంద్ర*
అంశం: సంఖ్య: *ఘటన*15/15
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
             సీసమాలిక
         ***************
బ్రహ్మాండ భాండము బ్రద్దలైనఘటన
గ్రహగోళ నక్షత్ర గతుల ఘటన
భూమిపై ఖండాలు భూరివార్థులుగన
ఏర్పడెక్రమముగా ఎల్ల లుండ
పృథివిపై జీవమ్ముసృష్టించిమానవ
పరిణామ క్రమములచరితములను
ఆదిమానవజీవనాధ్భుతశైలిని
నవ్యమానవవుని నాగరికత
సంతరించుకొనగ సంగ్రామరీతులు
నిరతము సాగిన నిత్యఘటన
రాజ్యాలు రాజులు రామాయణాదులు
భారత యుద్ధాలు భరతభువిని
స్వాతంత్ర్య పోరులు,సమరాలు సంధులు
ఎక్కడోనొకచోట నేర్పడగను
విద్యుత్తు యంత్రాలువీమాన మార్గాలు
భూమార్గ వాహన వ్యోమ గతులు
ఉత్పాతుపద్రవ ఉన్మాద ఘటనలు
ఉగ్రవాదపుచేష్ట లుర్వియందు
తే!గీ!!
సుఖ జీవన ఫథమున సుందరముగ
రూపుది ద్దుకొనెను ఘటనలు రోజు రోజు
భావిజీవనముమనకింక భాగ్యమొసగు
ఘటనలు ఘాటించ వలయును ఘనతరముగ!
[6/11/2020, 7:08 PM] Phanindra J: ఫణి చవితిని పడతిఫణులనుగీసియు
ఫణికి పూజజేయ పరమ భక్తి
ఫణులు చట్టు జేరెపరికింప గనుపూజ
ఫణుల గుణము వీడి  ఫలము నీయ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తల్లిదండ్రులు

తల్లిదండ్రులు* 👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦👨‍👩‍👧‍👦 సీసమాలిక ********** వంశవృధ్ధినిజేయు వంశాంకురములను నెలలుతొమ...