డబ్బులెజీవనమ్మునకుడంబపుశైలికి దారితీయుగా
డబ్బులె పెంచునెంతగను డాబునుదర్పము సంఘమందునన్
డబ్బులెకారణమ్మునగు టక్కరిమోసము లెన్నొచేయగన్
డబ్బుయెమూలమౌ జగతి డబ్బులెతీర్చునభీష్టమంతయున్
త. భ. య. జ. స. ర. న. గ.
శ్రీవాణిభారతినిసేవింతునేమదినిశ్రీకారరూపజననీ
భావమ్ములోనిలిచిభాగ్యమ్ములీయగనువాగీశ్వరీకరుణతో
సావిత్రివైసకలసంసారవిద్యలకుసామ్రాజ్ఞిగావెలుగుచున్
మావాక్కులందుననుమాచిత్తమందుననుమమ్మేలు
శారద దయన్
కాళ రాత్రివినీవెమాకిలకల్మషమ్ములుబాపుమా
కాళిరూపుకపాలమాలలుకంఠమందునదాల్చియున్
కేలమున్ఘనవక్రఖడ్గముకేశముల్విరబోయుచున్
శూలిపత్నిగభద్రకాళిగజూడగార్దభవాహినీ
శ్రీ గౌరీశివవామభాగనిలయాశ్రీచక్రసింహాసినీ
శ్రీ గౌరీసుఖదాయినీసురనుతాసీమంతినీశాంభవీ
శ్రీ గౌరీగణనాథషణ్ముఖయుతాశ్రీమాత శ్రీదేవతా
శ్రీగౌరీరమశారదాత్రయసదా చిత్శక్తిసంధాయినీ
అష్టసిద్ధులనీయుమాఅణిమాదిసిద్ధులదాత్రివై
కష్టమంతయుబాపగాశ్రితకల్పవల్లిగబ్రోవవే
దుష్టదైత్యులద్రుంచియున్కలిదోషముల్హరియించుమా
ఇష్టదేవిగగొల్తునీశ్వరి యీప్సితమ్ములదీర్చగన్
సిద్ధిధాత్రిగగొల్తుమీశ్వరిసిద్ధులన్నియుబొందగన్
వృద్ధినొందగజీవితమ్ముసమృద్ధిసంపదలీయుమా
శ్రద్ధతోనవరాత్రిపూజలసల్పగాదయజూడుమా
సిద్ధిపేటనురేణుకాంబగశ్రీలనీయగ బ్రోవుమా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి